'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

ఈ మధ్యకాలంలో టైటిల్ ద్వారానే ఆసక్తిని రేకెత్తించిన సినిమాలలో ఒకటిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కనిపిస్తుంది. రాజేశ్ దండు నిర్మించిన ఈ సినిమాకి మోహన్ దర్శకత్వం వహించాడు. అల్లరి నరేశ్ - ఆనంది నాయకా నాయికలుగా నటించారు. మారేడుమిల్లి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.  

ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు ఉదయం 10:36 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఇంతకుముందు తమిళ సినిమాలను వరుసగా చేస్తూ వెళ్లిన ఆనంది, ఈ మధ్య కాలంలో తెలుగులో ఎక్కువగా చేస్తోంది. వెన్నెల కిశోర్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. అల్లరి నరేశ్ కి ఇది 59వ సినిమా కాగా, తన 60వ సినిమాను ఆయన 'నాంది' దర్శకుడితో చేస్తున్న సంగతి తెలిసిందే.

Allari Naresh
Anandi
Itlu Maredumilli Prjaneekam Movie

More Telugu News