జగన్ కేసుల్లో మంత్రి డెవలపర్స్ 25వ ముద్దాయి!: టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి
- సుశీల్ పీ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ
- జగన్ కేసుల్లో మంత్రి డెవలపర్స్ ప్రమేయాన్ని ప్రస్తావించిన టీడీపీ నేత
- నిందితుల జాబితాను తన ట్వీట్‌కు జత చేసిన అమర్నాథ్ రెడ్డి
జగన్‌పై నమోదైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో నిందితుల జాబితాను తన ట్వీట్‌కు జత చేసిన అమర్నాథ్ రెడ్డి... జగన్ కేసుల్లో మంత్రి డెవలపర్స్ 25వ ముద్దాయి అంటూ పేర్కొన్నారు. రూ.5 కోట్ల రుణాన్ని ఎగవేసిన వ్యవహారానికి సంబంధించి 2002లోనే మంత్రి డెవలపర్స్‌పై ఈడీ కేసు నమోదు చేయగా... శనివారం ఆ సంస్థ డైరెక్టర్ సుశీల్ పీ మంత్రిని అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.