ఫ్లిప్‌కార్ట్‌తో తెలంగాణ ఒప్పందం.. అన్లైన్లో లభించనున్న డ్వాక్రా ఉత్పత్తులు
- మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో కుదరిన ఒప్పందం
- తొలి ఏడాదే రూ.500 కోట్ల మేర విక్రయాలే లక్ష్యం
- ఫ్లిప్ కార్ట్ ఒప్పందంతో డ్వాక్రా మహిళలకు భారీ లాభమన్న మంత్రి
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఈ తరహా ఒప్పందాల్లో దేశంలోనే ఇది మొదటిదని చెప్పారు. ఒప్పందం కుదిరిన తొలి ఏడాదిలోనే రూ.500 కోట్ల మేర విలువైన డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ తన వినియోగదారులకు విక్రయించనుందని ఆయన తెలిపారు. ఫ్లిప్ కార్ట్ చేపట్టిన ఏ కార్యక్రమం కూడా విఫలం కాలేదన్న మంత్రి... ఈ ఒప్పందంతో తెలంగాణ డ్వాక్రా మహిళలకు కూడా భారీ లబ్ధి చేకూరనుందని తెలిపారు.