'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఖరారు!

రవితేజ కథానాయకుడిగా సుధాకర్ చెరుకూరి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కథానాయికగా నటించగా, మరో కథానాయికగా రజీషా విజయన్ అలరించనుంది. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు.  

కొంతసేపటి క్రితం కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చేనెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆయన పాత్ర చాలా కీలకమైనదని అంటున్నారు. 

 ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. సామ్ సీఎస్ స్వరపరిచిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో రవితేజ ఉన్నాడు. నాజర్ .. నరేశ్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Raviteja
Divyansha Koushik
Ramarao On Duty Movie

More Telugu News