మరోసారి మారుతి దర్శకత్వంలో నాని!
- నాని తాజా చిత్రంగా రూపొందుతున్న 'దసరా'
- ఆ తరువాత సినిమా మారుతి దర్శకత్వంలో
- గతంలో ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'భలే భలే మగాడివోయ్'
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు
- ఈ లోగా నాని నుంచి రానున్న 'దసరా'
'పక్కా కమర్షియల్' సినిమాను జులై 1వ తేదీన థియేటర్లకు తీసుకుని వస్తున్న మారుతి, ఆ తరువాత సినిమాను ప్రభాస్ తో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'బుజ్జిగాడు' తరహా కథను ప్రభాస్ కి వినిపించినట్టుగా మారుతి కూడా చెప్పాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయన ఫ్రీ కావాలంటే చాలా సమయం పడుతుంది.
అందువలన ఈ లోగా నానితో ఒక సినిమా చేయాలని మారుతి నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఆయన కథ వినిపించడం .. నాని ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులను మారుతి సిద్ధం చేసే లోగా, నాని 'దసరా' సినిమాను పూర్తిచేస్తాడన్న మాట.