కొత్త భవనంలోనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
- కొత్త భవనం భారతదేశ స్వావలంబన చిత్రాన్ని స్పష్టంగా చూపిస్తుంది
- సాంకేతిక, భద్రత పరంగా పాత భవనం కంటే ఎంతో ముందంజలో కొత్త భవనం
- సభ్యుల సహకారంతో ఉత్పాదకత పెరిగిందన్న ఓం బిర్లా
పార్లమెంటులో ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని ఓం బిర్లా అన్నారు. సభ్యులందరి సహకారంతో సభను రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అన్ని పార్టీలు తమ నేతలతో మాట్లాడాలని స్పీకర్ అన్నారు. తాను కూడా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడి సభ సజావుగా సాగాలని, క్రమశిక్షణ, సభా మర్యాదలు పాటించాలని చెబుతూనే ఉంటానని చెప్పారు. సభ్యుల సహకారంతో ఉత్పాదకత, చర్చల స్థాయి గణనీయంగా పెరిగిందని అన్నారు.