అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరే నియామకాలు చేపట్టాలి: షర్మిల
- ఆగ్రహజ్వాలలు రాజేసిన అగ్నిపథ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం
- ఆందోళనకారులపై పోలీసుల కాల్పులు
- బీజేపీకి బుర్రలేదన్న షర్మిల
- దేశంలో అలజడులకు కారణమవుతోందని వ్యాఖ్యలు
అయినప్పటికీ తగ్గేదేలేదంటూ నియామకాలు చేస్తామని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటూ మోదీ సర్కారు మొండిగా పోతోందని షర్మిల మండిపడ్డారు. అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరిగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయినందున, మరిన్ని అల్లర్లకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.