Team India: టీమిండియాకు చావో రేవో!.. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ప్రోటీస్‌!

south africa wins the toss and opt to chase in third t20 match at vizag
షార్ట్స్‌లో చూడండి
టీమిండియాతో టీ20 సిరీస్‌లో వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ బ‌వుమా టాస్ నెగ్గాడు. సాగ‌ర న‌గ‌రం విశాఖ‌లోని డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్టేడియంలో మ‌రికాసేప‌ట్లో మూడో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి కాసేప‌టి క్రితం ముగిసిన టాస్‌లో నెగ్గిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుని ఆతిథ్య జ‌ట్టు టీమిండియాను ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌లు నెగ్గిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 2-0 ఆధిక్యంలో కొన‌సాగుతోంది. విశాఖ మ్యాచ్‌లోనూ ఆ జ‌ట్టు నెగ్గితే... సిరీస్ ద‌క్షిణాఫ్రికా వ‌శ‌మ‌వుతుంది. అదే స‌మ‌యంలో మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే... టీమిండియా సిరీస్‌ను కోల్పోనుంది. ఈ నేప‌థ్యంలో ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవోగా మారిపోయింది.
Go Back to Shorts
Team India
South Africa
T20 Series
Vizag
Temba Bavuma

More Telugu News