టికెట్ ఉన్నా అనుమతించని ఎయిరిండియా... రూ.10 లక్షల జరిమానా వడ్డించిన డీజీసీఏ
- పలు నగరాల్లో డీజీసీఏ తనిఖీలు
- ఎయిరిండియా తప్పిదాల గుర్తింపు
- షోకాజ్ నోటీసు జారీ
కొన్ని సందర్భాల్లో ప్రయాణికులకు నష్ట పరిహారం తప్పనిసరిగా చెల్లించాలని నిబంధనలు పేర్కొంటున్నా, ఎయిరిండియా ఆ నిబంధనలను పాటించలేదని డీజీసీఏ ఆరోపించింది. దీనిపై ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు పంపామని, వ్యక్తిగత విచారణ సైతం ఏర్పాటు చేశామని తెలిపింది. ఎయిరిండియాలో ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించే విధానం లేదని తెలిసిందని కూడా డీజీసీఏ పేర్కొంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఎయిరిండియాకు రూ.10 లక్షల జరిమానా విధించామని ఓ ప్రకటనలో తెలిపింది.