ఈ నెల 15 నుంచి ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లు
- కరెంట్ బుకింగ్ స్థానంలో ఆన్ లైన్ విధానం
- భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్ణయం
- రోజుకు 750 టోకెన్ల జారీ
- వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం
జూన్ 15వ తేదీ ఉదయం 10 గంటలకు టికెట్ల జారీ ప్రారంభం కానుంది. జూన్ 16వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు రోజుకు 750 టోకెన్లను ఆన్ లైన్ విధానంలో కేటాయించనున్నారు. అంగప్రదక్షిణ టికెట్లను tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది.