Chandrababu: వెంకాయమ్మను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు... 'చలో కంతేరు'కు పిలుపు

Chandrababu talks to Venkayamma
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల వెంకాయమ్మ అనే మహిళ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పగా, ఆమెపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, వెంకాయమ్మ కుమారుడు వంశీపైనా దాడి జరిగింది. అతడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు... వెంకాయమ్మను ఫోన్ లో పరామర్శించారు. ఆమె కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు, వెంకాయమ్మపై దాడి ఘటన పట్ల డీజీపీకి లేఖ రాశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, వెంకాయమ్మ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అటు, రేపు 'చలో కంతేరు'కు చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు పిలుపు మేరకు రేపు టీడీపీ దళిత నేతలు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు వెళ్లనున్నారు. 

అంతకుముందు, తాడికొండ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వెంకాయమ్మకు మద్దతుగా నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు తరలిరాగా, పోటీగా వైసీపీ నేతలు కూడా వచ్చారు. దాంతో అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది.
Go Back to Shorts
Chandrababu
Venkayamma
Kanteru
TDP

More Telugu News