Vicky Kaushal: విక్కీపై చేయి వేసి ఫొటో దిగిన ఫరాఖాన్.. కత్రినాను ఉడికించేలా ట్వీట్

నిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్.. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ను ఉడికించే ప్రయత్నం చేశారు. ఇందుకు ఇన్ స్టా గ్రామ్ వేదికగా నిలిచింది. ప్రస్తుతం ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ఫరాఖాన్, కత్రినా కైఫ్ భర్త, నటుడు విక్కీ కౌశల్ క్రొయేషియాలో ఉన్నారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని విక్కీ భుజంపై చేయి వేసి సన్నిహితంగా ఉంటూ ఫరాఖాన్ ఓ ఫోటో తీసుకుంది. విక్కీ కౌశల్ తెల్లటి టీ షర్ట్ లో ఉంటే, ఫరా నల్లటి చెక్స్ తో ఉన్న టాప్ తో కనిపించింది. 

ఈ ఫొటోను ఫరాఖాన్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘సారీ కత్రినా కైఫ్.. అతడు మరొకరిని గుర్తించాడు’’అంటూ కత్రినా కైఫ్ ఉడికిపోయేలా పోస్ట్ పెట్టింది. నాలుక బయటకు వచ్చిన ఎమోజీ వేసింది. దీనికి కత్రినా మామూలుగా స్పందించింది. ‘‘మీకు అనుమతి ఉంది ఫరాఖాన్ కుందర్’’అంటూ కత్రినా స్పందించింది. కత్రినా పోస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో షారూక్ ఖాన్ నటించిన కల్ హో నా హో సినిమాలోని కుచ్ తో హువా హై పాట వినిపిస్తోంది. 

ఇక వీరిద్దరి మధ్యలోకి విక్కీ కౌశల్ కూడా దూరిపోయాడు. సదరు ఫొటోను తన ఖాతాలో షేర్ చేస్తూ ‘‘మేము కేవలం మంచి స్నేహితులం’’అని వివరణ ఇస్తూ ముగింపు పలికాడు. కొంతకాలం పాటు సహజీవనం చేసిన తర్వాత 2021 డిసెంబర్ లో కత్రినా, కౌశల్ వివాహం చేసుకోవడం తెలిసిందే.
Vicky Kaushal
Farah Khan
closed photo
Katrina Kaif
reaction

More Telugu News