'దసరా' విషయంలో మనసు మార్చుకున్న నాని!
- శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'దసరా'
- ఊరమాస్ లుక్ తో కనిపించనున్న నాని
- ఆయన సరసన రెండోసారి నటిస్తున్న కీర్తి సురేశ్
- క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచన
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఇంత మాస్ లుక్ తో నాని చేయడం ఇదే ఫస్టు టైమ్. టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాను 'దసరా'కి రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. అనుకున్నట్టుగా ఈ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకోకపోవడం వలన ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. క్రితం ఏడాది క్రిస్మస్ మనదే అంటూ 'శ్యామ్ సింగ రాయ్'తో నాని హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.