TDP: టీడీపీ అధికార ప్ర‌తినిధులతో చంద్ర‌బాబు వ‌ర్క్ షాప్‌... వైసీపీది అధ‌ర్మ యుద్ధ‌మంటూ కామెంట్

chandrababu fires on ysrcp
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ పాల‌న‌పై టీడీపీ అధికార ప్ర‌తినిధుల‌తో ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు గురువారం వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. వైసీపీ ప్ర‌భుత్వం అధ‌ర్మ పాల‌న కొన‌సాగిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. విలువ‌లు క‌లిగిన ఓ రాజ‌కీయ పార్టీగా వైసీపీ ఏనాడూ వ్య‌వ‌హరించ‌లేద‌ని కూడా చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. 

త‌ప్పుడు ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌ల‌ను వంచించ‌డ‌మే ల‌క్ష్యంగా వైసీపీ సాగుతోంద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను తూర్పార‌బ‌ట్టాల‌ని ఆయ‌న పార్టీ అధికార ప్ర‌తినిధుల‌కు సూచించారు. ఇందుకోసం సోష‌ల్ మీడియాను విరివిగా వాడుకోవాల‌ని కూడా ఆయ‌న దిశానిర్దేశం చేశారు.
Go Back to Shorts
TDP
Chandrababu
YSRCP
Andhra Pradesh

More Telugu News