విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- నీట్ పీజీ మెడికల్ సీట్ల భర్తీపై భారత వైద్య మండలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- ఆలిండియా కోటాలో 1,456 పీజీ మెడికల్ సీట్లు ఖాళీ
- సీట్లు ఖాళీగా ఉంచి ఏం సాధిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్న
- సీట్ల భర్తీ, ఖాళీలపై నేడే అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
బుధవారం నాటి విచారణ సందర్భంగా మెడికల్ కౌన్సిల్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీట్లను ఖాళీగా ఉంచి ఏం చేయాలనుకుంటున్నారని వైద్య మండలిని కోర్టు ప్రశ్నించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా? అంటూ వైద్య మండలితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. పరిస్థితిని చక్కదిద్దకపోతే వైద్య మండలి డీజీని కోర్టుకు పిలిచి ఆర్డర్ పాస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.