Virat Kohli: ఇండియన్ ఇన్స్టాగ్రామ్ కింగ్ గా చరిత్ర సృష్టించిన కోహ్లీ

Virat Kohli creates record in Instagram
షార్ట్స్‌లో చూడండి
క్రికెట్ లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ సోషల్ మీడియాలో సైతం తనకు తిరుగేలేదు అనే విధంగా ముందుకు సాగుతున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇన్స్టాలో 20 కోట్ల మంది ఫాలోయర్లను సంపాదించుకున్నాడు. 

ఇక ఈ మైలు రాయిని అందుకున్న ఏకైక భారతీయుడు కోహ్లీనే కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాలో అత్యధిక ఫాలోయర్లు ఉన్న క్రీడాకారుల్లో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో ఫుట్ బాల్ క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో (45 కోట్ల మంది ఫాలోయర్లు), లియోనల్ మెస్సీ (33.4 కోట్లు) ఉన్నారు. 

ఈ సందర్భంగా కోహ్లీ స్పందిస్తూ... తనకు మద్దతుగా నిలుస్తున్న ఇన్స్టా ఫ్యామిలీకి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నాడు. మరోవైపు 200 మిలియన్ల ఫాలోయర్లను సంపాదించుకున్న కోహ్లీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'నువ్వు ఎప్పటికీ కింగ్ కోహ్లీవే' అంటూ కితాబునిస్తున్నారు.
Go Back to Shorts
Virat Kohli
Instagram
Record

More Telugu News