మట్టికోట రారాజు రాఫెల్ నాదల్... రికార్డు స్థాయిలో 14వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం
- ఫైనల్లో కాస్పర్ రూడ్ పై ఏకపక్ష విజయం
- వరుస సెట్లలో నెగ్గిన స్పెయిన్ వీరుడు
- చివరి సెట్ లో విశ్వరూపం ప్రదర్శించిన నాదల్
- ఫ్రెంచ్ ఓపెన్ లో తిరుగులేని ఆధిపత్యం
ఓవరాల్ గా ఇది నాదల్ కు 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఇన్ని గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడు నాదల్ ఒక్కడే. నాదల్ సమకాలికులు రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ చెరో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్నారు.