నేటి యువతులకు ఆదర్శమూర్తి గవర్నర్ తమిళిసై: పవన్ కల్యాణ్
- నేడు గవర్నర్ తమిళిసై పుట్టినరోజు
- శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- భగవంతుడు ఆమెకు శతాయుష్షును ప్రసాదించాలని ఆకాంక్షించిన జనసేనాని
వైద్య సేవలు అందిస్తూనే, కుటుంబ నేపథ్యంగా వచ్చిన రాజకీయ రంగాన కూడా ఆమె తనదైన పాత్రను పోషిస్తూ, నేడు గౌరవప్రదమైన గవర్నర్ స్థాయికి ఎదిగారని అన్నారు. ఒక్క తెలంగాణకే కాకుండా పుదుచ్చేరికి కూడా ఇంఛార్జి గవర్నర్ గా నియమితులవ్వడం ఆమెలోని పరిపాలన దక్షతకు నిదర్శనమని చెప్పారు.
చిత్తశుద్ధితో ప్రజలకు ప్రేమతో సేవలందిస్తే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పడానికి తమిళిసై గారు నిలువెత్తు తార్కాణమని అన్నారు. ఆమెకు ఆ భగవంతుడు శతాయుష్షును ప్రసాదించాలని, ప్రజాసేవలో ఆమె నిరంతరంగా మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.