'అంటే .. సుందరానికీ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు!
- నాని తాజా చిత్రంగా రూపొందిన 'అంటే .. సుందరానికీ'
- ఈ సినిమాతో టాలీవుడ్ కీ నజ్రియా పరిచయం
- విభిన్న స్వభావాల మధ్య నడిచే ప్రేమకథ
- జూన్ 10వ తేదీన థియేటర్లకు రానున్న సినిమా
వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచాయి. విలేజ్ లో పెరిగిన ఓ బ్రాహ్మణ యువకుడు.. ఫారిన్ లో పెరిగిన క్రిస్టియన్ యువతి కలిసి చేసే ప్రేమ ప్రయాణమే ఈ సినిమా.
ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి డేట్ .. టైమ్ ఖరారు చేశారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో వచ్చేనెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.