ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్టు చేయాలి: సీపీఐ రామకృష్ణ
- రేపు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్న రామకృష్ణ
- డ్రైవర్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
- ఘటనపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి
డ్రైవర్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. సుబ్రహ్మణ్యం మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అనంతబాబును అరెస్టు చేయాలని ఏపీసీఎల్ఏ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. ఏపీ సర్కారుకి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన చెప్పారు.