మరో కేసులో దోషిగా హర్యానా మాజీ సీఎం... 26న శిక్ష ఖరారు
- టీచర్ల కుంభకోణంలో చౌతాలాకు పదేళ్ల జైలు శిక్ష
- శిక్ష ముగించుకుని వచ్చిన ఏడాదిలోపే రెండో కేసులో దోషి
- ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు
- 26న శిక్షను ఖరారు చేయనున్న కోర్టు
తాజా కేసు విషయానికి వస్తే.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఆరోపణలపై చౌతాలాపై గతంలోనే కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణను చేపట్టిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శనివారం చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయనకు ఏ తరహా శిక్ష విధించాలన్న విషయంపై కోర్టు ఈ నెల 26న చేపట్టనున్న విచారణలో నిర్ణయం తీసుకోనుంది.