మీది షరతుల్లేని ప్రేమ... ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా: ఎన్టీఆర్
- నేడు ఎన్టీఆర్ జన్మదినం
- 39వ పుట్టినరోజు జరుపుకున్న యంగ్ టైగర్
- గత రాత్రి నుంచే అభిమానుల కోలాహలం
- ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్
ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సినీ రంగ సహచరులు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. అంతేకాకుండా, తనకు విషెస్ చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వివరించారు.
"మీ అభిమానం నా హృదయాన్ని తాకింది... ఇవాళ్టి నా పుట్టినరోజుకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది" అని పేర్కొన్నారు. అయితే, అభిమానులు తనను క్షమించాలని, తాను ఇంటి వద్ద లేకపోవడం వల్ల కలుసుకోలేకపోయానని ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు. "నిష్కల్మషమైన మీ ప్రేమ, మద్దతు, దీవెనలతో ధన్యుడ్ని అయ్యాను. సదా మీకు రుణపడి ఉంటాను" అంటూ అభిమానుల పట్ల తన ప్రేమను చాటుకున్నారు.
.