భారత్ లో కొత్తగా 2,259 కరోనా కేసుల నమోదు!

2259 new cases recorded in India in the last 24 hours
  • నిన్న కరోనా నుంచి కోలుకున్న వారు 2,641 మంది
  • దేశ వ్యాప్తంగా 20 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,044
దేశంలో కరోనా కేసులు నిలకడగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,259 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,641 మంది కరోనా నుంచి కోలుకోగా... 20 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 4,31,29,563కి చేరుకుంది. 

ఇక ఇప్పటి వరకు 4,25,92,455 మంది కరోనా నుంచి కోలుకోగా... 5,24,323 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,044 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతంగా, రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,91,96,32,518 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 15,12,766 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News