Siddharth Malhotra: షూటింగ్ లో గాయపడ్డ కియారా అద్వానీ బోయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రా

Siddharth Malhotra injured in shooting
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ కియారా అద్వాణీ బోయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా సిద్ధార్థ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. విలన్స్ ను మట్టికరిపించే ఫైటింగ్ సీన్ లో రియల్ గానే సిద్ధార్థ్ కు గాయాలయ్యాయి. తన చేతి నుంచి రక్తం వస్తున్న వీడియోను సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరోవైపు దెబ్బలతోనే సిద్ధార్థ్ ఈ యాక్షన్ సీన్ ను పూర్తి చేశాడట.
Go Back to Shorts
Siddharth Malhotra
Bollywood
Injury

More Telugu News