నోరు అదుపులో పెట్టుకోండి!... కేటీఆర్‌కు డీకే అరుణ వార్నింగ్!
- అమిత్ షా తెలంగాణ టూర్‌పై కేటీఆర్ సెటైర్లు
- ఘాటుగా ప్రతిస్పందించిన డీకే అరుణ
- కేటీఆర్ తండ్రి పాస్‌పోర్టు బ్రోకర్ అన్న బీజేపీ నేత
అసలు మీ అయ్యా కొడుకుల స్థాయి ఏమిటి? మీ బతుకు ఏమిటి? అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ... మీ తండ్రి ఓ పాస్‌పోర్టు బ్రోకర్ అనే సంగతి మరిచారా? అంటూ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆమె కేటీఆర్‌కు సూచించారు. రెండు రోజుల క్రితం అమిత్ షా తెలంగాణ పర్యటనకు రాగా... ఆయన పర్యటనపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.