Chandrababu: రాజద్రోహం చట్టం నిలిపివేత‌పై చంద్ర‌బాబు స్పంద‌న‌

N Chandrababu Naidu on sedition law
షార్ట్స్‌లో చూడండి
రాజద్రోహం చట్టాన్ని నిలిపివేస్తూ సుప్రీంకోర్టు నిన్న‌ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై ఈ రోజు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు స్పందిస్తూ ట్వీట్ చేశారు. 

''రాజద్రోహం చట్టం 124 ఏ అమలును నిలిపివేస్తూ, దేశ అత్యున్నత ధర్మాసనం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఈ సెక్షన్‌ కింద ప్రభుత్వాలు కొత్త కేసులు నమోదు చేయ‌కూడ‌ద‌ని చెప్పడంతో పాటు, ఇప్పటికే పెట్టిన కేసులపై తదుపరి చర్యలు వద్దని స్పష్టం చేయడం హర్షణీయం.
 
నియంతృత్వ పోకడలు అనుసరించే ప్రభుత్వాలు తమ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని ఒక అస్త్రంగా మార్చుకుంటున్న ఈ తరుణంలో... ప్రజా హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం దోహదం చేస్తుంది'' అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News