రేవంత్ రెడ్డితో గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ భేటీ
- వ్యక్తిగత పర్యటనకు హైదరాబాద్‌కు కామత్
- స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన గోవా మాజీ సీఎం
- పార్టీ పటిష్ఠత కోసం రేవంత్‌కు సలహాలు ఇచ్చిన సీనియర్ నేత
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా విద్యావంతులు అధికంగా ఉండే గోవా లాంటి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన కామత్... రాజకీయ వ్యూహాల్లో దిట్టగానే పేరు గాంచారు. 2007 నుంచి 2012 వరకు గోవా సీఎంగా వ్యవహరించిన కామత్... ఆ తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతూ వస్తున్నా.. తాను మాత్రం నిలిచి గెలుస్తున్నారు. ప్రతి ఎన్నికలోనూ అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లడం, రేవంత్ రెడ్డికి సలహాలు, సూచనలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.