విదేశీ ప్రయాణం కోసం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
- దుబాయిలో ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమం
- ఈడీ పర్యవేక్షణలో వున్న జాక్వెలిన్
- 15 రోజుల ప్రయాణానికి అనుమతించాలని కోరిన నటి
దీంతో జాక్వెలిన్ కు సంబంధించి రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో దుబాయిలో జరిగే ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా తనను అనుమతించాలని కోరుతూ ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్, నేపాల్ లోనూ పర్యటించాల్సి ఉందని కూడా ఆమె తెలిపింది. ఈడీ పర్యవేక్షణలో ఉన్నందున అనుమతి లేకుండా ఆమె విదేశీ ప్రయాణానికి వెళ్లడానికి లేదు. గత డిసెంబర్ లోనూ ఆమెను ముంబై ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించడం జరిగింది.