Chiranjeevi: త‌ల్లితో చిరు, నాగ‌బాబు, ప‌వ‌న్ తీసుకున్న వీడియో వైర‌ల్

chiranjeevi shares a video
షార్ట్స్‌లో చూడండి
మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న త‌ల్లికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో చిరంజీవి త‌మ్ముళ్లు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కూడా ఉన్నారు. త‌మ త‌ల్లితో కలిసి భోజ‌నం చేస్తూ చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇందులో క‌న‌ప‌డ్డారు. త‌న త‌ల్లికి చిరంజీవి గొడుగుప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా త‌మ త‌ల్లితో ముగ్గురు అన్న‌ద‌మ్ములు ఫొటోలు దిగారు. 

ఈ సంద‌ర్భంగా అమ్మలందరికీ అభివందనములు. మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ త‌ల్లుల‌ను గుర్తు చేసుకుంటూ మాతృ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.
Go Back to Shorts
Chiranjeevi
Tollywood
Viral Videos

More Telugu News