పెళ్లయిన తొలినాళ్లలో రేవంత్ రెడ్డి ఇలా ఉన్నారు!
- నేడు రేవంత్ 30వ వివాహ వార్షికోత్సవం
- టీపీసీసీ చీఫ్‌కు శుభాకాంక్షల వెల్లువ
- అరుదైన ఫొటోను పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత
ఆ ఫొటోలో తన భార్యతో కలిసి నేలపై కూర్చుని ఉన్న రేవంత్ రెడ్డిని చూస్తే... టక్కున గుర్తు పట్టడం కష్టమే. పెళ్లయిన తొలి నాళ్లలో తీయించుకున్న ఆ ఫొటోలో రేవంత్ రెడ్డి చాలా బక్క పలచగా ఉన్నారు. నాడు రాజకీయాలతో సంబందం లేకుండా సాగిన రేవంత్...ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్సీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. తాజాగా ఎంపీగా కొనసాగుతూనే టీపీసీసీ చీఫ్ పదవిలో కొనసాగుతున్నారు.