సిటీ బ‌స్సులో సజ్జ‌నార్‌.. టీఎస్ఆర్టీసీలో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం

tsrtc md sajjannar launch a new programme
  • థ‌ర్స్‌డే- బ‌స్ డే పేరిట కొత్త కార్య‌క్ర‌మం
  • ప్రయాణికుల అభిప్రాయ సేక‌ర‌ణే ల‌క్ష్యం
  • సిటీ బ‌స్సులో స్వ‌యంగా ప్రయాణికులతో మాట్లాడిన‌ స‌జ్జ‌నార్
ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌న్న ల‌క్ష్యంతో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ఓ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. థ‌ర్స్‌డే- బ‌స్ డే పేరిట చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆర్టీసీ సేవ‌ల‌పై ప్ర‌యాణికుల అభిప్రాయాల‌ను స‌జ్జ‌నార్‌ నేరుగా తెలుసుకోనున్నారు. 

కొత్త‌గా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా గురువారం నాడు ఆయన హైద‌రాబాద్‌లోని సిటీ బ‌స్సుల్లో ప్ర‌యాణించారు. ఆయా బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న వారితో మాట్లాడారు. ఆర్టీసీ సేవ‌ల‌పై వారి అభిప్రాయాల‌ను, ఫిర్యాదుల‌ను కూడా తెలుసుకునే య‌త్నం చేశారు. ప్ర‌యాణికుల‌తో పాటు ఆయా బ‌స్సుల్లో విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందితోనూ స‌జ్జ‌నార్ ముచ్చ‌టించారు.
Go Back to Shorts
TSRTC
V C Sajjannar
TSRTC MD
Thurs Day- Bus Day

More Telugu News