Atchannaidu: అధికారంలోకి వ‌చ్చి వైసీపీకి రిట‌ర్న్ గిఫ్టు ఇస్తాం: అచ్చెన్నాయుడు హెచ్చ‌రిక‌

atchennaidu slams ycp
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో 2024లో అధికారంలోకి వచ్చేది త‌మ‌ ప్రభుత్వమే అని, వైసీపీ రౌడీ మూక‌ల‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చ‌రించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశార‌ని, నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. త‌మ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించ‌బోమ‌ని చెప్పారు. 

వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల అరాచకాలు పెరిగిపోతున్నాయ‌ని అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న విష‌యంపై సీఎం జగన్ దృష్టి పెట్ట‌కుండా, ఆస్తుల ధ్వంసం, అక్రమ కేసులపైనే దృష్టి పెట్టార‌ని ఆయ‌న విమర్శించారు. వైసీపీ నేత‌ల‌ ఆలోచన అంతా దాడులు, ప్రాణాలు తీయడంపైనే ఉందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అరాచకాలకు తెగబడుతూ ప్రజలను భయపెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 
Go Back to Shorts
Atchannaidu
Telugudesam
YSRCP

More Telugu News