ఏపీలో తాజాగా 4 కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో గడచిన 24 గంటల్లో 3,595 కరోనా పరీక్షలు నిర్వహించగా, 4 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 3 కేసులు, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో 8 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు. గత కొన్నివారాలుగా ఏపీలో కరోనా మరణాల రేటు పడిపోయింది. అదే సమయంలో పాజిటివ్ కేసుల రేటు తగ్గిపోగా, రివకరీ రేటు పుంజుకుంది.
.
.