అవినీతి, అవినీతి అంటున్నారు.. ఏ వ్యవస్థలో లేదో చెప్పండి: ఏపీ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు
- పదేపదే అవినీతి అనడం సరికాదన్న బొప్పరాజు
- సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులను శుద్ధంగా ఉండమంటే ఎలా అని నిలదీత
- 25న ప్రభుత్వంతో జరిగే సమావేశంలో పీఆర్సీ జీవోలపై ప్రశ్నిస్తామన్న బొప్పరాజు
గుడివాడలో ఆర్ఐపై ఇసుక మాఫియా దాడి గురించి బొప్పరాజు మాట్లాడుతూ.. ఉద్యోగులపై భౌతిక దాడులు చేయడం సరికాదని అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిపై అందరూ తమను దోషులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 25న ప్రభుత్వంతో జరగనున్న సమావేశంలో పీఆర్సీపై జీవోల జారీ గురించి ప్రశ్నిస్తామని బొప్పరాజు తెలిపారు.