సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ... తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిషన్
- ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య
- టీఆర్ఎస్, పోలీసుల వేధింపులే కారణమంటున్న బీజేపీ
- ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్
ఆత్మహత్యకు ముందు కూడా సాయి గణేశ్ ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారని కూడా బీజేపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాయి గణేశ్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకే తెలంగాణ బీజేపీ నేతలు సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.