ఈ నెల 23న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

  • ఉమ్మడి పశ్చిమ గోదావరిలో కౌలు రైతు భరోసా యాత్ర 
  • 23 ఉదయం చింతలపూడికి పవన్ పయనం  
  • బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున సాయం 
  • చింతలపూడిలో పవన్ రచ్చబండ సభ  
ఇటీవల అనంతపురం జిల్లాలో పర్యటించి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన జనసేనాని పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23న పవన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది.

జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ నెల 23వ తేదీ ఉదయం పవన్ కల్యాణ్ 9 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడి వెళతారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను కలిసి జనసేన తరఫున రూ.1 లక్ష చొప్పున సాయం అందిస్తారు. ఆపై, చింతలపూడిలో జరిగే రచ్చబండ సభలో పాల్గొంటారు. ఆత్మహత్యలకు పాల్పడిన మరికొందరు రైతులకు రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేస్తారు. ఈ మేరకు పవన్ పర్యటన ఖరారైంది.

Pawan Kalyan
West Godavari District
Farmers
Janasena
Andhra Pradesh

More Telugu News