Chandrababu: ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్... ఆయనే మా నాన్న చంద్రబాబు గారు: నారా లోకేశ్‌

lokesh wishes chandrababu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న‌కు యువ‌నేత నారా లోకేశ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న తండ్రే త‌న సూప‌ర్ స్టార్ అని లోకేశ్ పేర్కొన్నారు. 

'జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు చెప్పాడు. ఆ ప్రకారంగా చూస్తే ఆయన (చంద్ర‌బాబు) దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాదిమందికి అన్నదాత అయ్యారు. 

ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా. లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్... ఆయనే మా నాన్న చంద్రబాబు గారు. నాన్నగారూ, మీకు జన్మదిన శుభాకాంక్షలు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా, చంద్ర‌బాబు నాయుడి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు దేవాలయాలలో ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొంటున్నారు. 
Go Back to Shorts
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News