రేపు చంద్ర‌బాబు బ‌ర్త్ డే సందర్భంగా... పోస్ట‌ర్‌ రిలీజ్ చేసిన నారా లోకేశ్

nara lokesh releases chandrababu birth day poster
  • 1950 ఏప్రిల్ 20న జ‌న్మించిన చంద్ర‌బాబు
  • రేపు ఆయ‌న 72వ జ‌న్మ‌దినం
  • ఓ రోజు ముందుగానే పోస్ట‌ర్ విడుద‌ల చేసిన లోకేశ్
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు బుధ‌వారానికి 72 ఏళ్లు పూర్తి చేసుకుని 73వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌నున్నారు. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిప‌ల్లెలో జ‌న్మించిన చంద్ర‌బాబు.. రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి.. ఉమ్మ‌డి రాష్ట్రానికి తొమ్మిదిన్న‌రేళ్లు సీఎంగా, ప‌దేళ్ల పాటు విప‌క్ష నేత‌గా, విభ‌జిత ఏపీకి ఐదేళ్లు సీఎంగా వ్యవహరించి, గత మూడేళ్ల నుంచి విప‌క్ష నేత‌గా కొన‌సాగుతున్నారు. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌ముందు మంత్రిగా కూడా సుదీర్ఘ కాలం పాటు ప‌నిచేశారు. 

కాంగ్రెస్ పార్టీతో రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన చంద్ర‌బాబు...తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంద‌ర్భంలోనే మంత్రిగానూ ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అలుపెర‌గకుండా రాజ‌కీయాల్లో సాగుతున్న చంద్ర‌బాబు.. రేపు 72వ జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా ఒక రోజు ముందుగానే ఆయ‌న బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆయ‌న కుమారుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. రేపు మ‌రుపురాని విధంగా చంద్ర‌బాబుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుదామంటూ ఆయ‌న పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.
Go Back to Shorts
TDP
Chandrababu
NCBN
Nara Lokesh

More Telugu News