‘పుష్ప’ అవతారమెత్తిన రాజస్థాన్ బౌలర్ మెక్ కాయ్
- కోల్ కతాతో మ్యాచ్ లో కనిపించిన దృశ్యం
- షెల్డన్ జాక్సన్ వికెట్ తీసిన తర్వాత పుష్ప పోజు
- చివరి ఓవర్లో రెండు వికెట్ల పతనంతో విజయం
అదే ఓవర్ లో అతడు తన తొలి వికెట్ తీశాడు. విజయానికి 11 పరుగులే కావాల్సిన దశలో.. కెప్టెన్ సంజు శామ్సన్ నమ్మకంతో మెక్ కాయ్ కు బౌలింగ్ ఇచ్చాడు. అతడు అదే ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టి, కట్టుదిట్టమైన బౌలింగ్ తో పరుగులు పారకుండా చేసి, విజయానికి దోహదపడ్డాడు. చివరి ఓవర్ లో మెక్ కాయ్ ముందుగా షెల్డన్ జాక్సన్ వికెట్ తీశాడు. ఆ వెంటనే చేయిని గడ్డం కింద నుంచి తిప్పుతూ పుష్ప పోజు ఇచ్చాడు. అంతేకాదు గెలుపు తర్వాత కూడా ఎదురుపడిన కెమెరాలకు పుష్ప కటింగ్ ఇచ్చాడు మెక్ కాయ్.