నా సత్తా ఏమిటో చూపిస్తా.. భారీ ర్యాలీలో మంత్రి ఆర్కే రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సత్తా ఏమిటో చూపిస్తా.. భారీ ర్యాలీలో మంత్రి ఆర్కే రోజా

will Show what I am Said AP Minister RK Roja
  • మంత్రి పదవి చేపట్టాక తొలిసారి నగరిలో పర్యటన
  • ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్కన్న మంత్రి
  • నగరి ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారన్న రోజా
  • 2024లోనూ జగనే ముఖ్యమంత్రి అని ధీమా
మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి నిన్న నగరి నియోజకవర్గానికి వచ్చిన ఆర్కే రోజా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రిగా తన సత్తా ఏమిటో చూపిస్తానని అన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్కని, ఇకపై మరో లెక్క అని పేర్కొన్నారు. తనకు కేటాయించిన పర్యాటకశాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చడంపై దృష్టి సారిస్తానన్నారు.

తనకు ఇక సీటు రాదని, రోజా పని అయిపోయిందని ప్రచారం జరిగిందని, అలా ఎగతాళి చేసిన వారి నోళ్లు మూతపడేలా ఇక్కడి ప్రజలు తనను రెండుసార్లు గెలిపించారని అన్నారు. తల్లిదండ్రులు తనకు జన్మనిస్తే, నగరి ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారని పేర్కొన్నారు.

2024లోనూ జగనే ముఖ్యమంత్రి అవుతారని రోజా ధీమా వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు నగరి ప్రజలకు సేవ చేస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు జగనన్న కోసం పనిచేస్తానని రోజా పేర్కొన్నారు.
RK Roja
Andhra Pradesh
Jagan
YSRCP
Nagari

More Telugu News