ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పూజలు... సందడి చేసిన వానరం... వీడియో ఇదిగో!
- కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి పూజలు
- పక్కనే కూర్చున్న వానరం
- ఎంత తరిమినా కదలని కోతి
- సాక్షాత్తు ఆంజనేయుడే వచ్చాడన్న స్థానికులు
అయితే, ఆలయంలో ఆంజనేయస్వామికి మంత్రి పూజలు నిర్వహిస్తుండగా ఓ వానరం వచ్చి, ఆమె వద్దనే కూర్చుంది. దాంతో మంత్రి ఓవైపు ఆ కోతిని గమనిస్తూనే పూజల్లో పాల్గొన్నారు. ఆ వానరం ఎంతకీ అక్కడ్నించి కదలకపోగా, మంత్రిని వెన్నంటే కూర్చుంది.
దాంతో, అక్కడికి వచ్చిన వారందరూ హనుమంతుడే వానరం రూపంలో వచ్చి మంత్రిని ఆశీర్వదించాడంటూ చర్చించుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.