Congress: టీపీసీసీ వ్యూహ‌క‌ర్త‌గా సునీల్‌.. ఇక‌పై ప్ర‌తి స‌మావేశానికి హాజ‌రు

sunil is the new strategist for tpcc
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ)కి వ్యూహ‌క‌ర్త‌గా సునీల్ అనే వ్య‌క్తి నియ‌మితుల‌య్యారు. శ‌నివారం నాడు పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన పార్టీ సీనియ‌ర్ నేత‌ల స‌మావేశానికి హాజ‌రైన సునీల్ అత‌డి బృందం... స‌మావేశంలో ప్ర‌తి నేత లేవ‌నెత్తిన అంశాల‌ను నోట్ చేసుకున్నారు. 

అంతేకాకుండా ఇక‌పై పార్టీలో జ‌రిగే దాదాపు అన్ని భేటీల‌కు సునీల్ టీం స‌భ్యులు హాజ‌ర‌వుతార‌ని కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల కంటే ముందుగానే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలోనే టీపీసీసీకి వ్యూహాలు ర‌చించేందుకు సునీల్‌ను నియ‌మించిన‌ట్లుగా తెలుస్తోంది.
Go Back to Shorts
Congress
TPCC
Manickam Tagore

More Telugu News