Nagababu: మీరు మూర్ఖుల పాలనలో జీవించడం ఖాయం: నాగబాబు
సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తన మనసులోని మాటను నిస్సంకోచంగా వెల్లడిస్తారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఆయన ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'మీరు మీ ప్రభుత్వ వ్యవహారాలపై ఆసక్తి చూపకపోతే... మీరు మూర్ఖుల పాలనలో జీవించడం ఖాయం' అని ట్వీట్ చేశారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనే విషయంలో క్లారిటీ లేదు. అయితే, వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్టు నెటిజన్లు భావిస్తున్నారు.