నారాయణ ఇంటికి విజయసాయిరెడ్డి... సీపీఐ నేత అర్ధాంగికి నివాళి
- అనారోగ్యంతో గురువారం నారాయణ భార్య వసుమతి మృతి
- జాబ్ మేళా ఏర్పాట్ల పరిశీలన కోసం తిరుపతికి వచ్చిన సాయిరెడ్ది
- వసుమతికి నివాళి అర్పించిన వైసీపీ నేత
శనివారం నుంచి తిరుపతిలో వైసీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించేందుకు సాయిరెడ్డి శుక్రవారం తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా సీపీఐ నేత ఇంటికి వెళ్లారు. వసుమతిదేవి పార్థివ దేహానికి నివాళులర్పించారు. నారాయణ, ఆయన కుటుంబ సభ్యులను సాయిరెడ్డి పరామర్శించారు.