నా బలం, నా సర్వస్వం అమ్మే.. తల్లి విజయమ్మకు షర్మిల భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలు

YS Sharmila Wishes Mother Vijayamma Happy Birthday
  • నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ విజయమ్మ
  • తల్లి వైఎస్ విజయమ్మకు ఏపీసీసీ చీఫ్ షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు
  • సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరిత సందేశం
  • ప్రపంచంలోనే అద్భుతమైన అమ్మ అంటూ పోస్ట్
ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్ధాంగి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తన తల్లికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బర్త్ డే విషెస్ తెలిపారు. విజయమ్మ 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా షర్మిల సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.

"ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన అమ్మకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు!

నాకు నడకలు నేర్పిన దగ్గరి నుంచి జీవితంలోని ప్రతి అడుగులో నన్ను ప్రోత్సహించడం వరకు, నువ్వే నాకు కొండంత అండగా, మార్గదర్శిగా, నా బలంగా నిలిచావు. నువ్వు పంచిన ప్రేమకు, అందించిన వివేకానికి, నా కోసం నువ్వు చేసిన అంతులేని త్యాగాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ కొత్త దశాబ్దం నీకు ప్రశాంతతను, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నువ్వు కోరుకున్న సంతోషాన్నంతా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజునే కాదు, ప్రతి రోజూ నిన్ను స్మరించుకుంటూనే ఉంటాను.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను! ఆ భగవంతుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి అమ్మా!" అంటూ షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు. 
Go Back to Shorts
YS Vijayamma
YS Sharmila
YS Rajasekhara Reddy
Vijayamma birthday
APCC President
Mother's Day
Telugu News
Andhra Pradesh Politics
Family
Birthday wishes

More Telugu News