గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో ఆప్కో షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి అమ‌ర్నాథ్

minister gudivada amarnath opens apco showroom in gannavaramairport
  • ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రిగా అమ‌ర్నాథ్‌
  • గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో నూత‌నంగా ఆప్కో షోరూమ్‌
  • కార్యక్రమంలో పాల్గొన్న ఆప్కో చైర్మ‌న్‌, డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ 
ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రిగా నూత‌నంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన గుడివాడ అమ‌ర్నాథ్ బుధ‌వారం నాడు గన్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. ఎయిర్‌పోర్టులో కొత్త‌గా ప్రారంభించిన ఆప్కో షోరూమ్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆప్కో చైర్మ‌న్‌ చిల్లపల్లి మోహనరావు, డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ వీసీ అండ్ ఎండీ నాగరాణి, ఆప్కో సిబ్బంది పాల్గొన్నారు.
Go Back to Shorts
Gudivada Amarnath
Gannavaram Airport
Apco Showroom

More Telugu News