మిర్చి కోతకు ఆటోలో వెళ్తుండగా కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీల దుర్మరణం
- హనుమకొండ జిల్లాలో ఘటన
- క్షతగాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమం
- మాందారిపేట వద్ద ఆటోను ఢీకొట్టిన లారీ
మృతులను మంజుల (45), రేణుక (48), విమల (50)గా గుర్తించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గాయపడిన వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.