ఆసక్తిని రేపుతున్న విశాల్ 'లాఠీ' లుక్!

Laatti Movie first look poster released
  • యాక్షన్ ఎంటర్టైనర్  గా 'లాఠీ'
  • పోలీస్ కానిస్టేబుల్ గా విశాల్ 
  • కథానాయికగా సునైన
  • త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన   
మాస్ యాక్షన్ హీరోగా తెలుగు  .. తమిళ భాషల్లో విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. రమణ  - నంద నిర్మిస్తున్న ఈ సినిమాకి వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో విశాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చాలా సినిమాలు చేశాడు. అయితే ఈ సారి ఈ సినిమాలో మాత్రం ఆయన కానిస్టేబుల్ గా కనిపించనున్నాడు. 

అయితే ఈ కానిస్టేబుల్ కూడా మాంచి పవర్ఫుల్ అనే తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి విశాల్ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఒళ్లంతా గాయాలైనా .. లాఠీ పట్టుకుని ధైర్యంగా అక్కడే నిలబడిన ఆయన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పీటర్ హెయిన్ .. దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఈ సినిమా షూటింగును చాలా వేగంగా పూర్తిచేసే పనుల్లో ఉన్నారట. తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సునైన తెలుగు సినిమాలతోనే తన కెరియర్ ను మొదలుపెట్టి కొన్ని సినిమాలు చేసింది. 'రాజ రాజ చోర' తనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 'లాఠీ' ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
Go Back to Shorts
Vishal
Sunaina
Vinod kumar
Laatthi Movie

More Telugu News