నాని సినిమా నుంచి సాంగ్ ప్రోమో విడుదల!
- నాని హీరోగా 'అంటే .. సుందరానికీ'
- కథానాయికగా నజ్రియా
- కీలకమైన పాత్రలో నదియా
- జూన్ 10వ తేదీన విడుదల
జూన్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబంలో ఆచార వ్యవహారాల మధ్య పెరిగిన సుందరం, విదేశాలకి వెళ్లి అక్కడ పడే అవస్థలే ఈ కథ. పంచెకట్టుతో నాని విదేశాల్లోని వీధుల్లో తిరగడం ఈ సాంగ్ ప్రోమోలో కనిపిస్తోంది.
పూర్తి పాటను రేపు సాయంత్రం 6:03 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చెప్పారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో తెలుగు తెరకి నజ్రియా నజీమ్ పరిచయమవుతోంది. ముఖ్యమైన పాత్రల్లో నదియా .. రోహిణి .. హర్షవర్ధన్ .. సుహాస్ కనిపించనున్నారు