'ఖాతాబుక్' సీఈఓకు కేటీఆర్ ఆహ్వానంపై డీకే శివకుమార్ స్పందన ఇదే
- బెంగళూరులో వసతులు లేవన్న ఖాతాబుక్ సీఈఓ
- హైదరాబాద్ వచ్చేయాలంటూ కేటీఆర్ ఆహ్వానం
- కేటీఆర్ ట్వీట్‌ను సవాల్‌గా స్వీకరిస్తున్నట్లు డీకే వెల్లడి
- 2023 చివరి నాటికి కర్ణాటకలో అధికారం చేపడతామని ప్రకటన
ఇక కేటీఆర్ ఇచ్చిన ఈ ఆహ్వానంపై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సోమవారం ఒకింత ఘాటుగానే స్పందించారు. కేటీఆర్‌ను స్నేహితుడిగానే సంబోధించిన డీకే శివకుమార్..కేటీఆర్ ఆహ్వానాన్ని ఓ సవాల్‌గా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా 2023 చివరి నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన డీకే.. దేశంలోనే అత్యుత్తమ నగరంగా బెంగళూరుకు ఉన్న వైభవాన్ని పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌కు కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.